Trump: నాలుగు సార్లు అమెరికా అధ్యక్షుడిగా చేసింది ఆయనొక్కడే.. 5 d ago

అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది..? అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్పాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్ లో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండొంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడొంతుల రాష్ట్రాలు ఆమోదించాలి.
అమెరికాలో అధ్యక్ష పదవీ కాలం నాలుగేళ్లు. రెండు సార్లు మాత్రమే ఆ పదవిలో ఉండొచ్చు. అయితే అమెరికా చరిత్రలో నాలుగుసార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి అత్యంత ప్రభావవంతమైన నేతగా నిలిచారు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. ఈయన హయాంలోనే అధ్యక్షపదవిలో రెండు పర్యాయాలు మాత్రమే ఉండాలన్న 22వ అధికరణం అమలులోకి వచ్చింది.1944లో నాలుగోసారి అధ్యక్ష ఎన్నికల్లో రూజ్వెల్ట్ ఆరోగ్యం క్షీణించింది. అయితే రెండో ప్రపంచయుద్ధం చివరి దశలో ఉండటంతో తన సేవలు అవసరమని పోటీచేశారు. సోవియట్ నేత స్టాలిన్ తో చర్చలు జరపడం మిగతా దేశాలను సమీకృతం చేసి ఐరాస ఏర్పాటుకు ముందడుగు వేశారు.